Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premagala Maa Prabhuvaa

ప్రేమగల మా ప్రభువా

Premagala Maa Prabhuvaa

Lyricist: Seeyonu Geethaalu
Verse
ప్రేమగల మా ప్రభువా
ప్రేమయై యున్నావయా‖ 2x ప్రేమగల ‖
Verse
నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె‖ 2x ‖
నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే‖ 2x ప్రేమగల ‖
Verse
అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను‖ 2x ‖
అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను‖ 2x ప్రేమగల ‖
Verse
బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను‖ 2x ‖
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను‖ 2x ప్రేమగల ‖
Verse
తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు‖ 2x ‖
తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే‖ 2x ప్రేమగల ‖
Verse
మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా‖ 2x ‖
వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను‖ 2x ప్రేమగల ‖

Related Tags

PraiseLoveGod