Chorus
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా
Verse
నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె
నిక్కముగ ఋజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే
Verse
అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను
అద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను
Verse
బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను
Verse
తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు
తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే
Verse
మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా
వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను