Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premaku Prathipalamu Praana Thyaagama

ప్రేమకు ప్రతిఫలముప్రాణ త్యాగమా

Premaku Prathipalamu Praana Thyaagama

Verse
మమతతో మనిషిని మలిచావయ్యా
ప్రేమతో పాపిని పిలిచావయ్యా
మమతకు ఫలితము నీ మరణమా
ప్రేమకు ప్రతిఫలము నీ ప్రాణమా
Verse
ప్రేమనే చూపిన - నీ దేహము
కొరడా దెబ్బలతో -తల్లడిల్లేనే
కరుణను చూపిన నీ ముఖము
మూర్కుల చేతిలో చిద్రమాయెనే‖ నాకై నలుగురిలో నలిగిపోతివే ‖
Verse
బరువైన సిలువను మోయుచు
షాలేము వీదులలో సొమ్మసిల్లెనే
మూడుమేకులపై అల్లాడుతూ
పాపికై సిలువలో మరణమాయెనే‖ నాకై కలువరిలో కన్నుమూసేనే ‖
Verse
మమతతో మనిషిని మలిచావయ్యా
ప్రేమతో ప్రతి పాపిని పిలిచావయ్యా
మమతకు ఫలితము నీ మరణమా
ప్రేమకు ప్రతిఫలము నీ ప్రాణమా

Related Tags

SacrificeLoveCrucifixion