Verse
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా‖ 2x ‖
అనుదినమూ - అనుక్షణము‖ 2x ‖
నిన్నే స్తుతింతును ప్రభువా‖ 2x ‖
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
Verse
ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా‖ 2x ‖
నన్నెంతగానో ప్రేమించినావు‖ 2x ‖
నీ ప్రాణమిచ్చావు నాకై‖ 2x ‖
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
Verse
ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా‖ 2x ‖
హౄదయాంగణములోకి అరుదెంచినావు‖ 2x ‖
నాకెంతో ఆనందమే‖ 2x ‖
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా
Verse
శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా‖ 2x ‖
శోధన, రోదన ఆవేదనలో‖ 2x ‖
నిన్నే స్తుతింతు (ను) ప్రభువా‖ 2x ‖
Verse
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా‖ 2x ‖
అనుదినమూ - అనుక్షణము‖ 2x ‖
నిన్నే స్తుతింతును ప్రభువా‖ 2x ‖
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా