Chorus
Prema Mayuda Naa Yesayya
ప్రేమమయుడా నా యేసయ్యా
నీ ప్రేమను వివరించలేనయ్యా‖ 2x ‖
నీ ప్రేమను వర్ణించలేనయ్యా
నీ ప్రేమకు వెలకట్టలేనయ్యా‖ 2x ‖
నీ ప్రేమను నే మరువలేనయ్యా
Verse
దారి తప్పి తిరుగుచుండగా
చల్లని స్వరముతో పిలిచితివి తండ్రి
సిలువలో పలికిన నీ మాటలే
ఆకర్షించెను నా హృదయమును‖ 2x ‖
నీ మాటలే నన్ను బ్రతికించినది
ఆవేదనలో ఆదరించినది‖ 2x ‖
Verse
బ్రతుకు భారమై అలసి ఉండగా
నీ రెక్కల పై మోసితివి తండ్రి
సిలువలో చూపిన నీ ప్రేమయే
బ్రతకాలనే ఆశ కలిగించినది‖ 2x ‖
నీ ప్రేమయే నన్ను చేరదీసేను
జీవితమునకు విలువ కలిగెను‖ 2x ‖
Verse
ఈ లోక ప్రేమలు మారిపోవును
శాశ్వతమైనది నీ ప్రేమయే తండ్రి
సిలువలో చేసిన నీ త్యాగమే
రక్షణ భాగ్యము నా కోసగినది‖ 2x ‖
నీ ప్రేమ నాలో పరిమళించెను
నా హృదిలో నా కొలువాయెను‖ 2x ‖