Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premamrutha dhaarala chindina mana yesuku samamevaru

ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు

Premamrutha dhaarala chindina mana yesuku samamevaru

Verse
ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు?
ప్రేమయె తానై నిలచి - ప్రేమోక్తులనె పల్కి
ప్రేమతో ప్రాణముబెట్టి - ప్రేమగరికి చనియె
Verse
నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది
ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడిరా
Verse
ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా
పాపభారముతో రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు
Verse
ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెద వేల
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము

Related Tags

GospelSalvationJesusLove