Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premamrutthadharalu Chindinchina Yesa

ప్రేమామృత్తధారలు చిందించిన యేస

Premamrutthadharalu Chindinchina Yesa

Chorus
ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?
ఆ-ఆ-ఆ ప్రేమయెతానై నిలచి ప్రేమవాక్కులనే బలికి
ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమనగరికి చనియె‖ ప్రేమా ‖
Verse
నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది
ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా‖ ప్రేమా ‖
Verse
ఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా
పాపభారముతో రారా పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్‖ ప్రేమా ‖
Verse
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల?
రక్షణ దిన మిదియేరా తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము ముదమారగ జేకొనుము‖ ప్రేమా ‖

Related Tags

RepentanceSalvationLove