Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premantu Edhaina Unte Yesele Adhi Yesele

ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే అది యేసేలే

Premantu Edhaina Unte Yesele Adhi Yesele

Lyricist: Jonah Samuel
Verse
ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే అది యేసేలే
మనసున్న మనిషెవరయినా మరి స్పందించి ప్రేమించునులే
మనసా మనసా స్పందించు నిజమైన ప్రేమను గుర్తించు
మనసారా నిను ప్రేమించే ఆ దేవుని ప్రేమకు స్పందించు
Verse
ఒక్క చూపులోనే పుట్టుకొచ్చు ప్రేమలెన్నో
ఒక్క మాటతోనే మాయమవ్వు ప్రేమలెన్నో
వేయినోళ్లు చెప్పలేని గొప్ప భావమే ప్రేమ
ఏ కళ్ళు చూడలేని దైవరూపమే ప్రేమ
ఊహించలేనంతగా నిను ప్రేమించె ఆ దైవము
చేతల్లో చూపాడుగా నీపై ఉన్న ఆ ప్రేమను
ఇంకెందుకో ఆలస్యము ప్రేమించు యేసయ్యను
ఇంకెన్నాళ్ళిలా నిర్లక్ష్యము ఏ రోజో నీ అంతము
మంచివాడ్ని కూడా ద్వేషించు నీ లోకం
ఎంత పాపినైన కూడా ప్రేమించెనే దైవం
పాపమంటే రోగం దాని వల్లనే మరణం
యేసు ప్రేమలోనే వైద్యం యేసు రక్తమే ఔషధం
మన్నిస్తూ ఉన్నాడుగా నీలో ఉన్న పాపాలను
కాపాడుతున్నాడుగా నీ ప్రాణాత్మదేహాలను
ఇంకెందుకో ఆలస్యము ప్రేమించు యేసయ్యను
ఇంకెన్నాళ్ళిలా నిర్లక్ష్యము ఏ రోజో నీ అంతము

Related Tags

SalvationJesusLove