Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Premasagara Ee Dharamarana Edarilona

ప్రేమసాగరా ఈ ధరమరణ ఎడారిలోన

Premasagara Ee Dharamarana Edarilona

Chorus
ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన
దారి తప్పితిన్‌ నీ మధరు స్వరము వినబడి
నీ దరికి చేరితిన్‌ - దరికి చేరితిన్‌
Verse
శతృవైన సాతాను యుక్తిలోన పడితినాయ్య‖ 2x ‖
ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్‌ తప్పించెనయ్యా‖ ప్రేమ ‖
Verse
చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను‖ 2x ‖
చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణజూపి‖ ప్రేమ ‖
Verse
కన్నతండ్రి ప్రేమ యెరుగకున్న పామరుండనయ్యా‖ 2x ‖
అన్న యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్యా‖ ప్రేమ ‖
Verse
గుండెలదిరి పోయెనాకు కొండమీద ప్రియునిగాంచి‖ 2x ‖
చిందెయేసు రుధిరము నా బండవంటి హృదయం కరుగ‖ ప్రేమ ‖
Verse
కాలమెల్ల గడిచిపోయె చాలునింక లోక బ్రతుకు‖ 2x ‖
మేలుకొలుపు కలిగె నీదు జాలి గొలుపు పిలుపు వినగ‖ ప్రేమ ‖

Related Tags

DevotionalRepentanceSalvation