Verse
ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము‖ 2x ‖
రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము‖ 2x ప్రేమతో ‖
Verse
పాపమెరుగని ప్రభు నీ కొరకు
పాపముగను చేయబడెను‖ 2x ‖
శాపగ్రాహియాయె సిలువలో
శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము‖ 2x ప్రేమతో ‖
Verse
ముండ్ల కిరీటమును ధరించి
ముఖముపై నుమ్మి వేయబడె‖ 2x ‖
ప్రాణమిడె నేసు సిలువలో
ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము‖ 2x ప్రేమతో ‖
Verse
సిలువలో నీకై దప్పిగొని
కలుష నీ క్షమకై ప్రార్థించి‖ 2x ‖
సహించి ప్రాణమిడె నీ కొరకు
సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము‖ 2x ప్రేమతో ‖
Verse
తప్పిన గొర్రెను రక్షింప
తనదు రక్తమును చిందించె‖ 2x ‖
కాపరి స్వరము ధ్వనించె
కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము‖ 2x ప్రేమతో ‖
Verse
తామసించ తగదిక ప్రియుడా
త్వరపడుము నీ రక్షణ కొరకు‖ 2x ‖
నేడే నీ రక్షణ దినము
నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము‖ 2x ప్రేమతో ‖
Verse
తానే కడుగును తన రక్తముతో
తండ్రివలె నీ పాపమునంత‖ 2x ‖
తనయుడవై పోదు విపుడే
తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము‖ 2x ప్రేమతో ‖
Verse
ప్రేమవార్త ప్రకటింపబడె
ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము‖ 2x ‖
కృపాకాలమిదే జాగేల
కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము‖ 2x ప్రేమతో ‖