Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preme Saaswathamaina Parishuddhamaina Podharillu

ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు

Preme Saaswathamaina Parishuddhamaina Podharillu

Lyricist: Hosanna Ministries
Verse
ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్ళుగ నను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో అభినయించి నే పాడెదను
ఉండలేను బ్రతుకలేను
నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా
కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో
కరువుసీమలో సిరులొలికించెను నీ వాక్యప్రవాహము
గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు
వివరింప నా తరమా వర్ణింప నా తరమా
విధిరాసిన విషాదగీతం సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్ధానములతో నాట్యముగా మార్చితివి
మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు
మరువలేను యేసయ్యా

Related Tags

WorshipDevotionalGods Love