Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preminchi Nannu Naa Priya Yesu

ప్రేమించి నన్ను నా ప్రియ యేసు

Preminchi Nannu Naa Priya Yesu

Lyricist: Joshua Shaik
Verse
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
నీ ప్రేమలోనే నడిపించినావు
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా
Chorus
మార్గము నీవే క్షేమము నీవే – చల్లగ చూసే దేవుడ నీవే
ఈ బ్రతుకంతా నీ పాద చెంత – నా ప్రభు నీవే అణువణువంతా
నీ కృపలోనే నా బలమంతా – కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే జీవితమంతా – నా గురి నీవే ప్రభూ‖ నా గురి నీవే ప్రభూ ‖
Verse
కొండలలోన లోయలలోన – అండగా నీవై నడిపిన దేవా
వేదనలోన శోధనలోన – తోడుగా నీవై నిలచిన దేవా
ఉన్నతమైన నీ ఘనకార్యం – ఏమని వివరింతును
ఆశ్రయమైన నీ సన్నిధానం – ఎంతటి నా భాగ్యము‖ ఎంతటి నా భాగ్యము ‖

Related Tags

WorshipDevotionalGrace