Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Preminthunu Ninne

ప్రేమింతును నిన్నే

Preminthunu Ninne

Verse
ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై
ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై
యేసూ… నీవే…
అతి సుందరుడా – అతి శ్రేష్టుడా
నీవే… అతి కాంక్షనీయుడా
నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా‖ ప్రేమింతును ‖
Verse
నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా
ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా‖ 2x ‖
నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు
నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా‖ 2x యేసు ‖
Verse
నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది
నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది‖ 2x ‖
షాలేము రాజా సమాధాన కర్తా
రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా‖ 2x యేసు ‖

Related Tags

PraiseWorshipDevotional