Chorus
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా‖ 2x ‖
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా‖ 2x ‖
Verse
నను ప్రేమించీ భువికొచ్చినదీ ప్రేమా
నీ ప్రేమా
సిలువలో మరణించీ బలియైన ప్రేమా‖ 2x ‖
ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు‖ 2x Chalayya Premistha ‖
Verse
కన్నీటిని తుడిచి ఓదార్చును ప్రేమా
నీ ప్రేమా
కరములు చాపి కౌగిట చేర్చును ప్రేమా‖ 2x ‖
ఆ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు‖ 2x Chalayya Premistha ‖
Verse
నా స్థితి మార్చీ నను రక్షించెను నీ ప్రేమా
నీ ప్రేమా
నను దీవించీ హెచ్చించినదీ నీ ప్రేమా‖ 2x ‖
నీ ప్రేమా
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు‖ 2x Chalayya Premistha ‖