Verse
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా‖ 2x ‖
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయా‖ 2x ప్రేమిస్తా ‖
Verse
నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ
సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ‖ 2x ‖
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు‖ 2x చాలయ్యా ‖
Verse
కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ‖ 2x ‖
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు‖ 2x చాలయ్యా ‖
Verse
నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ
నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ‖ 2x ‖
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు‖ 2x చాలయ్యా ‖