Verse
ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట
ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా
Verse
కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా
సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే‖ ప్రియ యేసు ‖
Verse
నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై
నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా‖ ప్రియ యేసు ‖
Verse
ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ
బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా‖ ప్రియ యేసు ‖
Verse
ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను
సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును