Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priya Yesu Nirminchithivi

ప్రియ యేసు నిర్మించితివి

Priya Yesu Nirminchithivi

Verse
ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
మృదమార వసియించునా
హృదయాంతరంగమున
Verse
నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును‖ 2x ‖
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి‖ 2x ప్రియ యేసు ‖
Verse
అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి‖ 2x ప్రియ యేసు ‖
Verse
వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే‖ 2x ‖
చేరితి నీదు దారి
కోరి నడిపించుము‖ 2x ప్రియ యేసు ‖
Verse
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు‖ 2x ‖
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా‖ 2x ప్రియ యేసు ‖

Related Tags

WorshipDevotionalPrayer