Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priya Yesu Raajunu

ప్రియ యేసు రాజును

Priya Yesu Raajunu

Lyricist: Songs Of Zion
Verse
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు‖ 2x ‖
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు‖ 2x ప్రియ యేసు ‖
Verse
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి‖ 2x ‖
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను‖ 2x ‖
బంగారు వీదులలో తిరిగెదను‖ 2x ప్రియ యేసు ‖
Verse
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్‖ 2x ‖
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి‖ 2x ‖
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్‖ 2x ప్రియ యేసు ‖
Verse
హృదయము స్తుతులతో నింపబడెను
నా భాగ్య గృహమును స్మరించుచు‖ 2x ‖
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ‖ 2x ‖
వర్ణింప నా నాలుక చాలదయ్యా‖ 2x ప్రియ యేసు ‖
Verse
ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో‖ 2x ‖
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో‖ 2x ‖
ఆశతో వేచియుండే నా హృదయం‖ 2x ప్రియ యేసు ‖

Related Tags

WorshipSecond ComingHeaven