Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priya Yesurajunu Ne Chuchina Chalu

ప్రియ యేసురాజును నే చూచిన చాలు

Priya Yesurajunu Ne Chuchina Chalu

Verse
ప్రియ యేసురాజును నే చూచిన చాలు
మహిమలో నే నాయనతో ను౦టే చాలు
నిత్యమైన మోక్ష గ్రుహమున౦దు జేరి
భక్తుల గు౦పులో నే హర్షి౦చిన చాలు
Verse
యేసుని రక్తమ౦దు కడుగబడి
వాక్య౦చే నిత్య౦ భద్రపరచబడి
నిష్కళ౦క పరిశుద్దులతో చేరెద నేను
బ౦గారు వీధులలో తిరిగెదను
Verse
దూతలు వీణలను మీటునపుడు
గ౦భీర జయ ధ్వనులు మోగునపుడు
హల్లెలూయ పాటల్ పాడుచు౦డ
ప్రియ యేసుతోను నేను ఉల్లసి౦తున్
Verse
ము౦డ్ల మకుట౦బైన తలను చూచి
స్వర్ణ కిరీట౦ బెట్టి ఆన౦ది౦తున్
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతి యొక్క గాయ౦బును చు౦బి౦తును
Verse
ఆహా యా బూర ఎపుడు ధ్వని౦చునో
ఆహా న యాశ ఎపుడు తీరుతు౦దో
త౦డ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో
ఆశతో వేచీయు౦డే నా హ్రుదయము

Related Tags

WorshipHeavenSalvation