Chorus
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా‖ 2x ‖
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ‖ 2x ప్రియమైన ‖
Verse
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా‖ 2x నా ప్రియుడా ‖
Verse
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే‖ 2x నా ప్రియుడా ‖
Verse
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం‖ 2x నా ప్రియుడా ‖