Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priyamainatti Naa Yaathma Sthothra

ప్రియమైనట్టి నా యాత్మ స్తోత్ర

Priyamainatti Naa Yaathma Sthothra

Lyricist: Joachim Neander
Verse
ప్రియమైనట్టి నా యాత్మ
స్తోత్రంబు చెల్లింపు
మహిమ శక్తులుగల నా ఱేని
మన్నింపు
కూడుడిట
వీణెల గానమున
సన్నుతు లొసంగ రండి.
Verse
సర్వము వింతగ పాలనచేయుచు
నిన్ను
గరుడ విహగ పక్షము లందిడి
మిన్ను
నొరయగా
నడిపి సుఖముగా
నిత్యంబు
గాచిన ప్రభు నుతింపు.
Verse
ఎంతో చమత్కతిగా నా
యాత్మ! నిన్ సృజించి
క్షేమ మారోగ్యము నెసగగా
నడిపించి
కష్టములలో
బొదివి ఱెక్కలతో
బ్రోచిన ప్రభునుతింపు
Verse
అందరు గాంచెడులాగు నీ
స్థితి దీవించి
యాకసమందున నుండి కృపన్
గురిపించి
ప్రేమతో
జూచు నాతండెవ్వడో
శక్తు నా ప్రభు నుతింపు
Verse
సకలాంతః కరణంబులతోడ
నుతింపు
ఆయన నామ ప్రసిద్ధి
గీర్తింపు
వెలుంగులో
నా బ్రహాం సంతతితో
ప్రభునుతింపుమి ఆమేన్

Related Tags

PraiseWorshipAlmighty