Verse
ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా
అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము
కృతజ్ఞతతో పాడెదను
నిరంతరము స్తుతించెదను‖ ప్రియతమ ‖
Verse
అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు‖ 2x ‖
నా నిరీక్షణ ఆధారం నీవు
నమ్మదగిన దేవుడవు నీవు‖ 2x ‖
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా‖ 2x ‖
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం‖ కృతజ్ఞతతో ‖
Verse
పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను
పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను‖ 2x ‖
విశ్వసించిన వారందరికి
నిత్య జీవము నొసగె దేవా‖ 2x ‖
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా‖ 2x ‖
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం‖ కృతజ్ఞతతో ‖