Verse
ప్రియయేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో నుంటే చాలు
నిత్యమైన మోక్షగృహమునందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు
Verse
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యముచే నిత్యం భద్ర పరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను
బంగారు వీధులలో తిరిగెదరు
Verse
దూతలు వీణులను మీటునపుడు
గంభీర జయధ్వనులు మ్రోగునపుడు
హల్లెలూయ పాటలు పాడుచుండ
ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్
Verse
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతియొక్క గాయమును ముద్దాడెదన్
Verse
హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరించుచుండె
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
వర్ణింప నా నాలుక చాలదయ్యా
Verse
ఆహా యా బూర యెపుడు ధ్వనించునో
ఆహా నాయాశ యెపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో
ఆశతో వేచియుండె నా హృదయం