Chorus
ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం
ముదమార వసించునా హృదయాంతరంగమున
Verse
నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రీ ప్రతిపాపమును కడిగి‖ ప్రియ ‖
Verse
అజాగరూకుడనైతి నిజాశ్రయమువిడిచి
కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి‖ ప్రియ ‖
Verse
వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనె
చేరితి నీదుదారి కోరి నడిపించుము‖ ప్రియ ‖