Verse
ప్రియయేసు ప్రియయేసు
అతి ప్రియుడేసు పదివేలలో
ఆయనే నా దిక్కుగా కెవ్వరు?
Verse
ఇహమందు వేరేది పేరే లేదు
ఆయనే నా కొసగె ఆత్మానందం
నన్ను విమోచించి నా కొసగె విడుదల
ఆహా నా కందించె నిత్య ముక్తి
Verse
దైవపుత్రుండే నా ప్రియుడు యేసు
ప్రాయశ్చిత్తుడైన గొర్రెపిల్ల
యిహమున కరిగెను తన రక్తమిచ్చెను
కల్వరిపై ప్రాణమర్పించెను
Verse
సిలువలో వ్రేలాడి బలిగా నాయెన్
విలువైన ప్రాణము అప్పగించెన్
నలుగ గొట్టబడి గాయముల నొంది
తిరిగి లేచెను నా ప్రియుడు యేసు