Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Priyuda Nee Prema - Paadamul Cherithi

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి

Priyuda Nee Prema - Paadamul Cherithi

Verse
ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా‖ 2x ‖
Verse
నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా‖ 2x ‖
Verse
బలియైన గొఱ్ఱెగా - పాపములన్నిటిని మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా‖ 2x ‖
Verse
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా‖ 2x ‖

Related Tags

PraiseWorshipDevotional