Verse
ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది
యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా
స్తుతించుఁడి.
శుద్ధ, శుద్ధ, శుద్ద సర్వేశుఁడా‖ శుద్ధ ‖
యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా‖ సర్వోన్నతా ‖
Verse
జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్
జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.
Verse
నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్
మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.