Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pudami Pulakinche Nee Raakatho Prabhu

పుడమి పులకించే నీ రాకతో ప్రభూ

Pudami Pulakinche Nee Raakatho Prabhu

Verse
పుడమి పులకించే నీ రాకతో ప్రభూ
పరము భువికేగే నీ రాకతో ప్రభూ
జగతి కీర్తించిన ప్రేమ మూర్తివి నీవు
దివిని అలరించిన దైవ మూర్తివి నీవు
Verse
పరవశించే మానవాళి భూదిగంతాలలో
పరిమళించే సౌరభాలు నిన్ను కీర్తించగా
నింగిలోన దూత సైన్యం స్తోత్ర గీతం వినిపించగా
నిండియున్న చీకటంత తొలగిపోయే నీ రాకతో
పాపి రక్షణకై అవతరించితివా‖ 2x ‖
Verse
పరమ దేవుని పరిశుద్ధాత్ముని ప్రేమ సంభందమే
ప్రభు గావించిన ఇహపరంబుల ప్రేమ సంకల్పమే
నీ ప్రేమలో నీ చూపులో నీ స్పర్శలో ప్రేమామృతాం
స్వార్ధమెరుగని నీదు ప్రేమ షరతులుండనీ సాంగత్యమూ
పాపి రక్షణకై అవతరించితివా‖ 2x ‖

Related Tags

WorshipChristmasAdvent