Verse
పునరుత్థానుడా నా యేసయ్యా‖ 2x ‖
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను‖ 2x ‖
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు‖ 2x ‖
Verse
నీ కృప చేతనే నాకు
నీ రక్షణ భాగ్యము కలిగిందనీ‖ 2x ‖
పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు‖ 2x ‖
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వార కలిగిందనీ‖ 2x స్తుతి ‖
Verse
నే ముందెన్నడు వెళ్ళని
తెలియని మార్గం నాకు ఎదురాయెనే‖ 2x ‖
సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా‖ 2x ‖
నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే‖ 2x స్తుతి ‖
Verse
చెరలోనైన స్తుతి పాడుచు
మరణము వరకు నిను ప్రకటించెదా‖ 2x ‖
ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం‖ 2x ‖
యేసు మేఘాలపై త్వరగా రానుండగా
నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా‖ 2x స్తుతి ‖