Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Putte Yesundu Nedu Manaku Pun

పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్

Putte Yesundu Nedu Manaku Pun

Lyricist: Felix Andrew
Chorus
పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ
పరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు‖ పుట్టె ‖
Verse
ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి
పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు‖ పుట్టె ‖
Verse
యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె
నధములమైన మనలఁ‖ పుట్టె ‖
Verse
తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని
మరియు కొమరుని కర్పణము లిచ్చిరి‖ పుట్టె ‖

Related Tags

ChristmasNativityMessiah