Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Puttinadamma Yesayya Puttinadamma

పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా

Puttinadamma Yesayya Puttinadamma

Lyricist: John Wesly
Verse
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
పసులతొట్టెలో దీనుడై పుట్టి
పరమును వీడి మనకై వచ్చి
వింతైన ప్రేమను మనపై చూప
ఆశ్చర్యకరుడు దేవదేవుడే … పుట్టినాడమ్మా .. ఆ.. ఆ..
పాడు బ్రతుకులను బాగు చేయంగా
పాషాణ హృదయాన్ని మొత్తంగా చెయ్యంగా
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
ఆపదలోనే కాపాడువాడు
ఆత్మ బంధువు తానై నిలిచి
మంచులాంటి మనసునివ్వ
మదిలో నిండా మనసు నింప పుట్టినాడమ్మా .. ఆ.. ఆ..
గుండెల్లో బాధంతా దూరం చెయ్యంగా
సాగని పయనాన్ని ముందుకు కదిలింప
పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా
పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో
వింతైన తార నింగిలో వెలసె
నిక్కంగా చూడ పుడమిపైన
జీవము మార్గం జాడను చూప
నిత్యజీవం మనిషికివ్వగా పుట్టినాడమ్మా .. ఆ.. ఆ..

Related Tags

ChristmasNativity