Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Puttinaroju Sri Yesuraju

పుట్టినరోజు శ్రీ యేసురాజు

Puttinaroju Sri Yesuraju

Chorus
పుట్టినరోజు శ్రీ యేసురాజు
ఈ మహిపాప పరిహారి మన ప్రేమరాజు – రాజాధిరాజు
Verse
నాతి మరియమ్మ ఒడిలోన బాలుండుగా – నీతి వెదజల్లు నిజదైవ సూనుండుగా
చిట్టి చిన్నారిగా పొట్టి పొన్నారిగా – చిగురించెను దావీదు వంశాధికారి‖ రాజాధిరాజు ‖
Verse
ఖ్యాతిగా దూత సంగీత నాదంబులు – ప్రీతి కలిగించు యా గొల్ల మోదంబులు
పూజ లొనరించెగా తేజమనిపించెగా – భూజనంబు మనంబుల ప్రేమాధికారి‖ రాజాధిరాజు ‖
Verse
పరిమార్చను నీ ఘోర పాపంబులు – తొలగించను లోక విచారంబులు
కరుణా బృందమూ పరమానందమూ – నీ నేరము బాపెడి లోకాధికారి‖ రాజాధిరాజు ‖
Verse
నీతి స్థాపించు సీయోను పురవాసిగా – పరలోకంబు నేలేటి వేవెల్లుగా
త్వరలో వచ్చె నీ ధరకే తెంచె నీ – మహిమాన్విత పూజిత సర్వాధికారి‖ రాజాధిరాజు ‖

Related Tags

WorshipJesusChristmas