Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Puvvu Virisi Raalinaa

పువ్వు విరిసి రాలినా

Puvvu Virisi Raalinaa

Verse
పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును‖ 2x ‖
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో‖ పువ్వు ‖
Verse
ధరలో కలిమి లేములు
దరి చేరగానే కరగిపోవును‖ 2x ‖
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే‖ పువ్వు ‖
Verse
పుడమిలో ఫలియించుమా
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా‖ 2x ‖
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన‖ పువ్వు ‖
Verse
భువిలో బ్రతుకుట కన్నను
భగవంత సన్నిధి పెన్నిధి‖ 2x ‖
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా‖ పువ్వు ‖

Related Tags

GospelLifeReflection