Verse
పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది‖ 2x ‖
ఏ దినమందైనా ఏ క్షణమైనా‖ 2x ‖
రాలిపోతుంది నేస్తమా
ఆ.. వాడిపోతుంది నేస్తమా‖ 2x ‖
Verse
పాల రాతపైన నడిచినా గాని
పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని‖ 2x ‖
అందలము పైన కూర్చున్నా గాని
అందనంత స్థితిలో నీవున్నా గాని
కన్ను మూయడం ఖాయం
నిన్ను మోయడం ఖాయం‖ 2x ‖
కళ్ళు తెరచుకో నేస్తమా
ఆ.. కలుసుకో యేసుని మిత్రమా‖ 2x పువ్వు ‖
Verse
జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
డబ్బుతో కాలాన్ని గడిపినా గాని‖ 2x ‖
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే
అది నిన్ను చేరకముందే‖ 2x ‖
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా‖ 2x పువ్వు ‖
Verse
ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
ధరలో మనకేది స్థిరము కాదుగా‖ 2x ‖
ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
ఏది నీతో రాదనీ తెలుసా
వాడిపోయి రాలకముందే
ఎత్తి పారవేయక ముందే‖ 2x ‖
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా‖ 2x పువ్వు ‖