Chorus
రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు‖ రాజా ‖
Verse
తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ
జల్లనైన మోక్ష మియ్య‖ రాజా ‖
Verse
బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన
మోక్ష మొంద‖ రాజా ‖
Verse
మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి
లోనై లేచితి వయ్య‖ రాజా ‖
Verse
దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య
మోక్షంబు నియ్య‖ రాజా ‖