Verse
(యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును‖ 2x ‖
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను‖ 2x రాజా ‖
Verse
నా బలమా నా కోట
ఆరాధన నీకే‖ 2x ‖
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా‖ రాజా ‖
Verse
అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే‖ 2x ‖
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా‖ రాజా ‖
Verse
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్
ఆరాధన నీకే‖ 2x ‖
రూపించు దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా‖ రాజా ‖