Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajaa Nee Sannidhilone Untaanayyaa

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా

Raajaa Nee Sannidhilone Untaanayyaa

Lyricist: John J
Verse
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా‖ 2x ‖
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా‖ 2x ‖
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా‖ 2x రాజా ‖
Verse
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం‖ 2x ‖
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును‖ 2x ‖
నీవే రాకపోతే నేనేమైపోదునో‖ 2x నేనుండలేనయ్యా ‖
Verse
ఒంటరి పోరు నన్ను విసిగించినా
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా‖ 2x ‖
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు‖ 2x ‖
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా‖ 2x నేనుండలేనయ్యా ‖
Verse
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా‖ 2x ‖
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము‖ 2x ‖
నిన్ను మించిన దేవుడే లేడయ్యా‖ 2x నేనుండలేనయ్యా ‖

Related Tags

PraiseWorshipDevotional