Verse
రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక‖ 2x ‖
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును‖ 2x రాజాధి ‖
Verse
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి‖ 2x ‖
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద‖ 2x రాజాధి ‖
Verse
ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి‖ 2x ‖
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో‖ 2x రాజాధి ‖
Verse
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి‖ 2x ‖
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే‖ 2x రాజాధి ‖