Verse
రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా‖ 2x ‖
ఓ… మేఘ వాహనంబు మీద వేగమే
ఓ… మించు వైభవంబు తోడ వేగమే‖ రాజాధి ‖
Verse
ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా
ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ
భూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ‖ రాజాధి ‖
Verse
ఆ… ఆకసమున దూత లార్భటింపగా
ఆ… ఆదిభక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభ జేయ
యేసు నాధ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ‖ రాజాధి ‖
Verse
ఓ… పరమ యెరుషలేము పుణ్య సంఘమా
ఓ… గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమ దూతలార! భక్తులారా! – పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా‖ రాజాధి ‖