Chorus
రాజాధి రాజా రారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల
రారా రవికోటితేజ యేసురారా‖ రాజాధి ‖
ఓ...మేఘ వాహనంబుమీద వేగమే ఓ.. మించు వైభవంబుతోడ వేగమే
Verse
ఓ...భూజనంబులెల్ల తేరిచూడగా ఓ...నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబుసేయ భూరాజులెల్ల గూలిపోవ భూమియాకసంబు
మారిపోవ నీ మహా ప్రభావమునవేగ‖ రాజాధి ‖
Verse
ఆ...ఆకసమున దూత లార్భటింపగా ఆ ఆదిభక్త సంఘసమేతంబుగా
ఆకసంబు మధ్యవీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాధ! నీదు
మహిమలోన మాకదే మహానందమౌగ‖ రాజాధి ‖
Verse
ఓ...పరమ యెరుషలేము పుణ్యసంఘమా ఓ...గొఱియపిల్ల క్రీస్తు
పుణ్యసంఘమా పరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱియపిల్ల యేసురాజుపేర క్రొత్త గీతమెత్తి పాడరారా‖ రాజాధి ‖