Verse
రాజాధి రాజుపై కిరీటముంచుడి
పైలోకానంద సునాదంబుల నాలించుడి
లే లెమ్ము డెందమా! నా కై చావొందిన
రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి
Verse
ఈ ప్రేమ రాజుపై - కిరీటముంచుడి
ప్రకాశించు ప్రక్కచేతి - గాయంబుల్ చూడుడి
ఏదూత చూచును - భరింప గల్గును
నా వైపు వంగి చూచుచు - న్న - రాజున్ గొల్వుడి
Verse
ఈ రాజుపై - కిరీటముంచుడి
చావున్ జయించినన్ - రక్షించిన సజీవియై
చావున్ జయించెను - జీవంబుదెచ్చెను
హా! చావున్ గెల్చి - జీవకి - రీటంబు దెచ్చెను
Verse
ఈ మోక్షరాజుపై - కిరీటముంచుడి
నిత్యుడైన తండ్రితోన్ - శుద్ధాత్మతోడ నైక్యుడు
రవంబు చేయుడి - నిరంతరంబును
ఓ రాజా, నీకే నిత్యఘ - నత ఖ్యాతి గల్గును