Chorus
రాజాతి రాజ- రవికోటి తేజా
మహిపాల ఓయేసువా
కరుణా స్వభావా - రమణీయ దేవా
ప్రేమా స్వరూప - ఓ దివ్య తేజ
అర్పింతును నా జీవితం
అందుకొనుము నాదు హృదయం‖ 2x రాజాతి ‖
Verse
పరమందు నిన్ను ప్రణతింతునే
పరిశుద్ధుడు పరిశుద్ధుడునెంచి పాడుచూ
ఇహలోకంబున పాపులం ప్రణుతింతును నీ నామం
సర్వేశ్వరా మమ్ము దీవించుము‖ 2x రాజాతి ‖
Verse
ప్రభుయేసుని సాన్నిధ్యమే
శాంతి సమాధనములకు కారణం
ఆ దివ్యమైన యేసుని మధురమైన నామము
సర్వజనుల రక్షణ మూలాధారము‖ 2x రాజాతి ‖