Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raaju Puttenu Raaju Puttenu Lokamantha

రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా

Raaju Puttenu Raaju Puttenu Lokamantha

Lyricist: Shyam Joseph
Verse
రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను
ఊరు వాడా పండుగాయెను
కాంతులతో మెరసిపోయెను
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను
Verse
దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను
Verse
జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను

Related Tags

ChristmasNativity