Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajugaa Raaraajugaa

రాజుగా రారాజుగా

Raajugaa Raaraajugaa

Lyricist: Bro D Paul Jaya Kumar
Verse
రాజుగా రారాజుగా
ఏతెంచెనే బెత్లెహేములోన
రాజుగా క్రీస్తురాజుగా
ఉదయించెనే ఈ భువిలోన
లోకానికి శుభవార్తగా
మానవాళియే పరవశింపగా
నాలో నింపెను ఉల్లాసమే
నాలో నిండెను ఉత్సాహమే
నింగిలో వెలసెను తార
వెళ్ళిరి జ్ఞానులు చూడ
దూత సైన్యమే ఆనందభరితమై
ఆర్భాటధ్వని చేసిరి
క్రిస్మస్ క్రిస్మస్ హ్యపి హ్యపి క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
Bridge
దావీదు పురమునందు
ధన్యుడేసు పుట్టెను
గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
ఆరాధించె యేసును
క్రీస్తు ద్వారా రక్షణ
లోకానికి వచ్చెను
మన పాప శాపములు
తొలగింప వచ్చెను
అంధకారం తొలగించుటకు
అరుదెంచెను నీతి సూర్యుడు
అక్షయ భాగ్యం అందింపవచ్చెను
నిత్యజ్యోతిగా ఇలలో
నీవే మా దేవుడవు
నడిపించే నా నాయకుడవు
శాంతికి అధిపతి జీవజలనది
లేరయ్య నీకు సాటి

Related Tags

JesusChristmasBirth