Chorus
రాజుల రాజైన యేసు రాజు – భూజనులనేలున్
హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి
Verse
హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతున్ స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి‖ రాజుల ‖
Verse
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి‖ 2x ‖
Verse
ఆయన పరిశుద్ధ ఆలయమందు‖ 2x ‖
ఆయన సన్నిధిలో ఆ… ఆ…‖ 2x ఎల్లప్పుడు ‖
Verse
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము‖ 2x ‖
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము‖ 2x ‖
Verse
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము‖ 2x ‖
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
భూమిని పుట్టింపక మునుపు
లోకము పునాది లేనప్పుడు‖ 2x ‖
దేవుడు – దేవుడు – యేసే దేవుడు –‖ 2x ‖
Verse
తర తరాలలో – యుగ యుగాలలో – జగ జగాలలో
దేవుడు – దేవుడు – యేసే దేవుడు –‖ 2x ‖
Verse
సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో‖ 2x ‖
మహిమా మహిమా నా యేసుకే
మహిమా మహిమా నా రాజుకే‖ 2x ‖
Verse
యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా‖ 2x ‖
భయము లేదు జయము మనదే‖ 2x ‖
విజయ గీతము పాడెదము‖ 2x ‖
Verse
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే –‖ 2x ‖
Verse
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు‖ 2x ‖
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము‖ 2x ‖
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు‖ 2x ‖
Verse
అల్పా ఓమెగయూ – నిత్యుడైన దేవుడవు‖ 2x ‖
నిత్యనిబంధన చేశావు – నిబంధననే స్థిరపరచావు
నిన్ననేడు రేపు మారని దేవుడ నీవు‖ 2x ‖
Verse
పాడెద హల్లెలూయా
మరనాత హల్లెలూయా‖ 2x ‖
సద పాడెద హల్లెలూయా
ప్రభు యేసుకే హల్లెలూయా‖ 2x ‖
Verse
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము‖ 2x ‖
యేసు నాథుని మేలులు తలంచి‖ 2x స్తోత్రం ‖
Verse
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు‖ 2x ‖
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు‖ 2x ‖
రారాజుగా వచ్చుచున్నాడు‖ 2x యేసు ‖
Verse
స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే‖ 2x ‖
వేడుచుండు భక్తుల మొఱ్ఱను విని‖ 2x ‖
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే‖ 2x ‖
Verse
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము‖ 2x ‖
Verse
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెళ్లుదము‖ 2x ‖
Verse
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు‖ 2x ‖
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు‖ 2x ‖
Verse
ఆహా హల్లెలూయా – ఆహా హల్లెలూయా‖ 2x ‖
కష్టనష్టములెన్నున్నా – పొంగు సాగరాలెదురైనా‖ 2x ‖
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో‖ 2x ‖
Verse
రండి యెహోవాను గూర్చి
ఉత్సాహగానము చేసెదము‖ 2x ‖
Verse
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో‖ 2x ‖
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా‖ 2x ‖
Verse
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా‖ 2x ‖
యేసయ్య యేసయ్య యేసయ్యా‖ 2x ‖
Verse
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Verse
చరిత్రలోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా‖ 2x ‖
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును‖ 2x ‖
Verse
ఓరన్న – ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న – లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా – చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా
Verse
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును‖ 2x ‖
జలరాసులనుండి బలమైన చేతితో‖ 2x ‖
వెలుపల చేర్చిన బలమైన దేవుడు‖ 2x ‖
Verse
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం –‖ 2x ‖
Verse
గుండె చెదరిన వారిని బాగుచేయువాడని‖ 2x ‖
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని‖ 2x ‖
Verse
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
Verse
దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము‖ 2x ‖
Verse
దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం యేసుని దాసులము
నవయుగ సైనికులం పరలోక పౌరులము –‖ 2x ‖