Verse
రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
రాజుల రాజు…
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన‖ 2x ‖
జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు‖ 2x ‖
Verse
పరలోక మహిమను విడచి
దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప
నాతో నిలిచెను
పరలోక మహిమను విడచి
ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం
తరలి వచ్చెను‖ జన్మించెను ‖
Verse
యూదయ దేశమునందు
పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె
నా కోసమే
బంగారం సాంబ్రాణి బోళం
యేసయ్యకు – అర్పించి ఆరాధించి
ఆనందించిరి‖ జన్మించెను ‖