Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajula Raajuga Yaesu Prabhumdu

రాజుల రాజుగ యేసు ప్రభుండు

Raajula Raajuga Yaesu Prabhumdu

Chorus
రాజుల రాజుగ యేసు ప్రభుండు
రయమున రానై యున్నాడు
Verse
రక్షణాలంకారముతో - తక్షణమే సిద్ధపడి
అక్షయుడగు నా రక్షకుని - నిరీక్షణతో వేడండి
Verse
మన ప్రభు యేసుని రక్తము - మన పాపములను పోగొట్టి
మన ప్రభురాకడ మనకెంతో - మహిమానదము కలిగించున్
Verse
మొదట గొఱ్ఱెపిల్ల వలె - నొదిగి వచ్చెను మన ప్రభువు
కొదమసింహముగా వచ్చును - గుండెదిగులు పాపికి
Verse
గురుతులన్నియు జరుగుచుండ - సరిగా చూడుము విశ్వాసి
త్వరపడుము నీ ప్రభుని జూడ - కరములెత్తి ప్రార్థించు
Verse
ఎల్లరు క్రీస్తుని రాకను - ఉల్లాసముతో కోరుచు
హల్లెలూయ పాటలు పాడి - ఎల్లప్పుడు స్తుతియించెదము

Related Tags

PraiseSecond ComingJesus Christ