Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajulaku Raajaina Ee

రాజులకు రాజైన ఈ

Raajulaku Raajaina Ee

Verse
రాజులకు రాజైన ఈ మన విభుని
పూజ చేయుటకు రండి
ఈ జయశాలి కన్నా
మనకింకా రాజెవ్వరును లేరని‖ రాజులకు ‖
Verse
కరుణ గల సోదరుండై ఈయన
ధరణికేతెంచెనయ్యా‖ 2x ‖
స్థిరముగా నమ్ముకొనిన
మనకొసగు పరలోక రాజ్యమును‖ రాజులకు ‖
Verse
నక్కలకు బొరియలుండే నాకాశ
పక్షులకు గూళ్లుండెను‖ 2x ‖
ఒక్కింత స్థలమైనను
మన విభుని కెక్కడ లేకుండెను‖ రాజులకు ‖
Verse
త్వరపడి రండి రండి ఈ పరమ
గురుని యొద్దకు మీరలు‖ 2x ‖
దరికి జేరిన వారిని
ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము‖ రాజులకు ‖

Related Tags

WorshipJesusKing Of Kings