Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raajulaku Raajaina Yee Mana Vibhuni Pooja

రాజులకు రాజైన యీ మన విభుని పూజ

Raajulaku Raajaina Yee Mana Vibhuni Pooja

Lyricist: ఎస్ జేమ్సు
Verse
రాజులకు రాజైన యీ మన విభుని పూజసేయుటకు రండి యీ
జయశాలి కన్న మన కింక రాజెవ్వరును లేరని‖ రాజులకు ‖
Verse
కరుణగల సోదరుండై యీయన ధరణి కేతెంచె నయ్యా తిరముగా
నమ్ముకొనిన మన కొసఁగుఁ బరలోక రాజ్యమ్మును‖ రాజులకు ‖
Verse
నక్కలకు బొరియ లుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత
స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను‖ రాజులకు ‖
Verse
అపహాసములు సేయుచు నాయన యాననము పై నుమియుచుఁ
గృప మాలిన సైనికు లందరును నెపము లెంచుచుఁ గొట్టిరి‖ రాజులకు ‖
Verse
కరమునం దొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్ ధరణీపతి
శ్రేష్ఠుడా నీకిపుడు దండ మనుచును మ్రొక్కిరి‖ రాజులకు ‖
Verse
ఇట్టి శ్రమలను బొందిన రక్షకునిఁ బట్టుదలతో నమ్మిన
అట్టహాసముతోడను బరలోక పట్టణంబున జేర్చును‖ రాజులకు ‖
Verse
శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధముఁ జేసెను భక్తితోఁ
బ్రార్థించిన మనకొసగు రక్తితో నాముక్తిని‖ రాజులకు ‖
Verse
త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు దరికిఁ
జేరిన వారిని యీ ప్రభువు దరుమఁ డెన్నడు దూరము‖ రాజులకు ‖

Related Tags

WorshipDevotionalJesus Christ