Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raakada Prabhuni Raakada

రాకడ ప్రభుని రాకడ

Raakada Prabhuni Raakada

Verse
రాకడ ప్రభుని రాకడ
రాకడ రెండవ రాకడ
ఏ దినమో ఏ ఘడియో‖ 2x ‖
ఎవ్వరు ఎరుగనిది
రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది‖ రాకడ ‖
Verse
నోవాహు దినములలో జరిగినట్లుగా
లోతు కాలమున సాగినట్లుగా‖ 2x ‖
పాపమందు ప్రజలంతా మునిగి తేలగా
లోకమంతా దేవుని మరచియుండగా‖ 2x ‖
మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా
మహిమతో తన ప్రజల చేర పిలుచుగా‖ 2x రాకడ ‖
Verse
దేవుని మరచిన ప్రజలందరిని
సువార్తకు లోబడని జనులందరిని‖ 2x ‖
శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును
అగ్ని జ్వాలలతో అవని కాల్చును‖ 2x ‖
వేదనతో భూమినంత బాధపరచును
తన మహిమను ప్రజలకు తెలియపరచును‖ 2x రాకడ ‖

Related Tags

Second ComingEnd Times